వైరల్ అవుతున్న పవన్ పిక్

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 11:16 AM

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటోంది. అందులో ఒకటి సాహో కాగా, రెండో సినిమా సైరా. సాహో ఈనెల 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ హైప్ ఉంటుంది. అలానే మెగాస్టార్ చిరంజీవి రి ఎంట్రీ ఇచ్చిన తరువాత చేస్తున్న రెండో సినిమా ఇది.

పైగా ఇది చారిత్రాత్మక కథతో చేస్తున్న సినిమా. దీంతో దీనికి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. దీంతో పాటు ఇందులో మరో అంశం కూడా ఉన్నది. సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమై ఉన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య సైరా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. దేనికి సంబంధించిన ఫొటోలో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. టీజర్ కోసం అయన వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే, టీజర్ వరకే పవన్ వాయిస్ ఉంటుందా లేదంటే సినిమాలో కూడా ఫాలో అవుతుందా చూడాలి. సినిమాలో కూడా పవన్ వాయిస్ ఉంటె.. అది సైరాకు అదనపు బలం చేకూర్చినట్టు అవుతుంది. సైరా టీజర్ ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతుండగా, సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ అవుతుంది





Untitled Document
Advertisements