గర్భం దాల్చిన మహిళా నాలుక!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 12:42 PM

గర్భం దాల్చిన మహిళా నాలుక!

అవును మీరు వింటున్నది నిజమే. దక్షిణ కొరియాకు చెందిన ఓ 63 ఏళ్ల మహిళ నోటి భాగం గర్భం దాల్చింది. అయితే ఆ మహిళ టోడారోడెస్ పసిఫియస్ అనే సముద్ర జీవిని తినడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సముద్ర జీవి అంతర్గత అవయవాలను తొలగించకుండా పైపైన ఉడికించిన ఆమె ఆ మాంసం తిన్నది. దీంతో దాని వీర్యం ఆమె నోట్లో ఉండిపోయింది. నిజానికి ఆమె అ మాంసాన్ని మింగలేదు. ఓ ముక్క తినగానే నోట్లో ఎదో పురుగులు కుడుతున్నట్లు అనిపించడంతో వెంటనే ఉమ్మేసింది. వెంటనే నోరు కడుక్కుంది. కాని ఆ తర్వాత కూడా ఆమె నోట్లో తెల్లటి తెల్లటి పురుగుల్లాంటి జీవులేవో కదులుతున్న భావన కలిగింది. తర్వాత నోట్లో నొప్పి తీవ్రం కావడంతో ఆమె హాస్పిటల్‌కు పరిగెత్తింది. దీంతో ఆమె నోటిని పరీక్షించిన వైద్యులు, నాలుక, చిగుళ్లకు అంటుకొని 12 చిన్ని చిన్న స్పెర్మ్ బ్యాగులు ఉండటాన్ని గుర్తించారు. క్యాపుల్స్ లాంటి భాగంలో ఉన్న ఆ సముద్ర జీవి స్పెర్మ్‌ (spermatophores ) ఆమె నాలుక, చిగుళ్లలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో ఆమెకు నొప్పి తీవ్రమైంది. డాక్టర్లు వెంటనే వాటిని తొలగించారు. ఈ వివరాలను పారాసైటాలజీ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. అయితే సముద్ర జీవి వీర్యం ఇలా ఆమె నోట్లోకి ఎలా చొచ్చుకెళ్లిందనే విషయం మాత్రం పరిశోధకులు చెప్పలేకపోతున్నారు.





Untitled Document
Advertisements