ఆర్చర్ బంతికి కుప్పకూలిన స్మిత్!

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 11:37 AM

ఆర్చర్ బంతికి కుప్పకూలిన స్మిత్!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులోనూ సత్తా చాటాడు. ఒక దశలో 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న జట్టును స్మిత్ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న స్మిత్ ఆస్ట్రేలియాకు గౌరవప్రద స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 14 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. అయితే సెంచరీకి సమీపంలో ఉన్న స్మిత్ ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి తలకు బలమైన గాయం అయ్యింది. వెంటనే అక్కడున్న వైద్య బృందాలకు అతడికి చికిత్సను అందించాయి. ఇక ఆసీస్ వైద్యుల సూచన మేరకు స్మిత్.. రిటైర్డ్ హార్డ్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్మిత్ 80 పరుగులతో ఉన్నాడు. ఇక ఆ తరువాత సిడిల్ ఔట్ అయిన తరువాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ మరో 12 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో యాషెస్‌లో వరుసగా ఏడుసార్లు 50 పరుగులకు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.





Untitled Document
Advertisements