నార్సింగి‌లో కొత్త శాఖ

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 11:44 AM

నార్సింగి‌లో కొత్త శాఖ

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) తాజాగా నార్సింగి‌లో కొత్త శాఖను ప్రారంభించింది. ఈ శాఖను ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ ఓం ప్రకాశ్ మిశ్రా ప్రారంభించారు. హైదరాబాద్ సర్కిల్ నెట్‌వర్క్1 జనరల్ మేనేజర్ వి రమేశ్, సికిందరాబాద్ ఎఓ డిప్యూటీ జనరల్ మేనేజర్ వినితా భట్టాచార్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మిశ్రా డిజిటల్ బ్యాంకింగ్ ప్రాధాన్యతను, దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఎస్‌బిఐ పాత్ర గురించి వివరించారు. 22 వేలకు పైగా శాఖలు, అరవై వేలకు పైగా ఎటిఎంలతో బ్యాంకు 44 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తోందని చెప్పారు.హైదరాబాద్ నగరంలో అత్యంత కీలక ప్రాంతాల్లో ఒకటైన నార్సింగిలో శాఖను ప్రారంభిస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నార్సింగి శాఖ ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్‌లో 1143 వది. రెండు ఎటిఎంలు, ఒక క్యాష్ డిపాజిట్ మిషన్, పలు అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ శాఖ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించటలదన్న ఆశాభావాన్ని మిశ్రా వ్యక్తం చేశారు. మాదాపూర్ రీజియన్ రీజనల్ మేనేజర్ బిందు జనార్దన్ వందన సమర్పణ చేశారు.





Untitled Document
Advertisements