రైతులకు రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల నష్టం!!

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 05:23 PM

రైతులకు రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల నష్టం!!

వరదల కారణంగా మొత్తం యాబై మూడు వేల ఎకరాల భూమి ముంపునకు గురైందని, ఇందులో ముప్పై వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. రైతులకు రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులకు పూర్తి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, నెలకు సరిపడా సరుకులు ఇవ్వాలని, దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రస్తావించారు. వరదలు వచ్చాయని రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్న ఏపీ ప్రభుత్వం, సముద్రంలోకి పోయే నీటిని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కు మళ్లిస్తే కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఫిర్యాదు చేసింది? ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Untitled Document
Advertisements