ప్రియాంక విషయంలో పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఐరాస

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 07:26 PM

ప్రియాంక విషయంలో పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఐరాస

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కశ్మీర్‌పై భారత వైఖరిని బాహాటంగా సమర్ధించడంతో పాటు భారత రక్షణ మంత్రి పాకిస్తాన్‌కు చేసిన అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలను వెనకేసుకొచ్చారని, ఇది శాంతి, సామరస్య భావనలకు విరుద్ధమని పాక్‌ మానవ వనరుల మంత్రి షిరీన్‌ మజరి ప్రియాంకను యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా తొలగించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. అయితే ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి పాక్ కు దిమ్మతిరిగేలా జవాబిచ్చింది. గుడ్ విల్ అంబాసిడర్లు తమ వ్యక్తిగత అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని, తాము ఆందోళన చెందే అంశాలపై నిర్భీతిగా మాట్లాడవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్ వెల్లడించారు. ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా సమర్థంగా వ్యవహరిస్తున్నారని, ఆమె యూనిసెఫ్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటే మాత్రం పరిగణనలోకి తీసుకునేవాళ్లమని గుటెరాస్ స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements