సీసీ కేమరాకు చిక్కిన పిల్ల దెయ్యం...వైరల్ వీడియో

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 08:17 PM

సీసీ కేమరాకు చిక్కిన పిల్ల దెయ్యం...వైరల్ వీడియో

దెయ్యాలు ఉన్నాయంటారా...ఉంటే ఒక్కసారి ప్రత్యక్షంగా కనిపించిందీ లేదు. కేవలం సినిమాల్లో వాటికొక రూపం ఇచ్చారు కాని అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలీదు. అయితే జోయి నోలన్ అనే వ్యక్తి ఇటీవల ‘యూట్యూబ్’, ‘రెడిట్’ అనే సోషల్ మీడియా సైట్‌లో పోస్టు ఈ వీడియోను పోస్టు చేశాడు. అది ఏం వీడియో అంటే...అందులో పిల్ల దెయ్యం ఉంది. దీంతో అది వైరలయ్యింది. ఆగస్టు 8న రికార్డైన వీడియోలో ఓ చిన్న పిల్లాడి ఆత్మ కిచెన్‌ నుంచి హాల్‌లోకి వచ్చి, అక్కడి నుంచి మెట్లు దిగుతున్నట్లుగా ఉంది. ఆ పిల్లాడితోపాటు ఓ పిల్లి ఆత్మ కూడా ఇందులో కనిపించడం గమనార్హం. అర్ధరాత్రి 12.54 గంటల సమయంలో ఇది చోటుచేసుకుందని నోలన్ చెప్పాడు. ఈ ఇంట్లో ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని నోలన్ తెలిపాడు. అలాగే, ఇంట్లో ఎవరూ చనిపోయిన సమాచారం కూడా లేదన్నాడు. అయితే, నెటిజనులు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. అది కెమేరాకు పట్టిన బూజై ఉంటుందని కొందరు, ఇంకొందరు సాలీడు పురుగు తిరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు. ఆ ఆత్మలు తిరుగుతున్న హాల్‌లో ఓ కుక్క కూడా ఉంది. సాధారణంగా ఆత్మలు వంటివి కనిపిస్తే కుక్కలకు ముందే తెలిసిపోతుంది. ఆత్మలను చూడగానే అవి అరుస్తాయని, అది ఫేక్ వీడియో కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Untitled Document
Advertisements