వచ్చే నెలలో ఎంట్రీ

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 04:11 AM

వచ్చే నెలలో ఎంట్రీ

త్వరలో హైదరాబాద్ లో మెట్రోసిటి రహదారుల పై విస్తృతంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టాలని టిఆఎస్‌ఆర్‌టిసి యాజమాన్యం యోచిస్తున్నారు. ఈ మేరకు యాజనమాన్యం అక్టోబర్ మాసం చివరి నాటికి కల్లా దశల వారీగా 325 బస్సులను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టిఎస్‌ఆర్‌టిసి కేవలం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు నగరంలోని మియాపూర్ డిపో నందు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంతగం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు గ్రేటర్ వరంగల్ పట్టణంలో కూడా విస్తృతంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో 25 బస్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ సూపర్ లగ్జీరి, ఓల్వా బస్సు సర్వీసులను ప్రవేశ పెట్టారు. నిత్యం పెరుగుతున్న ఇంధన వనరుల ధరల మూలంగా ప్రత్యామ్నాయంగా చౌక రవాణా -పర్యావరణ హితమైన ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రవేశ పెట్టాలని యాజమాన్యం భావిస్తుంది. ఈ బస్సుల నిర్వహణ వ్యయం కూడా చౌకగా ఉండటంతో పాటు ప్రయాణికులకు అత్యంత సౌకర్యామైన ప్రయాణ సేవలు అందుబాటులో కి వస్తాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణ హిత-గ్రీన్ ట్రాన్స్ ఫొర్ట్ దిశగా టిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యం సంస్కరణలకు శ్రీకారం చేసింది.





Untitled Document
Advertisements