కోడెల కుమారుడు శివరామ్ ను త్వరలో ప్రశ్నిస్తాం!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 04:12 PM

కోడెల కుమారుడు శివరామ్ ను త్వరలో ప్రశ్నిస్తాం!!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆయన కుమారుడు శివరామ్ ను త్వరలో ప్రశ్నిస్తామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానం ఉన్న వారందరినీ ప్రశ్నిస్తున్నామని, అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకూ ఈ కేసులో 12 మందిని ప్రశ్నించామని, కోడెల కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశామని వివరించారు. కోడెల ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నామని, సీడీఆర్ఏ కాల్ లిస్ట్ రిపోర్ట్ ను పరిశీలిస్తున్నామని అన్నారు.

Untitled Document
Advertisements