సైరా ట్రైలర్...బాస్ ఈజ్ బ్యాక్

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 06:00 PM

చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి అఫిషియల్ ట్రైలర్ వచ్చేసింది. పెద్ద పెద్ద నగరాల్లోని అన్ని థియేటర్లలో సైరా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్‌ను చూసి మెగా అభిమానులు సంబర పడిపోతున్నారుమెగాస్టార్ చిరంజీవి హీరోగా.. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ మొత్తం ఐదు భాషల్లో అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ స్టేడియంలో భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే వేడుకలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22 కు వాయిదా పడటంతో ట్రైలర్‌ను ముందే విడుదల చేశారు.

అలాగే సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక, జగపతిబాబు, రవికిషన్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను కూడా ఈ యాక్షన్ టీజర్‌లో విడుదల చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించారు.

Untitled Document
Advertisements