తండ్రిమీద కోపం...10 ఏళ్ల బిడ్డను రేప్ చేసి హత్య

     Written by : smtv Desk | Fri, Oct 04, 2019, 09:43 AM

తండ్రిమీద కోపం...10 ఏళ్ల బిడ్డను రేప్ చేసి హత్య

ఓ చిన్నారి తండ్రి మీద ఉన్న కోపంతో ఓ కామాంధుడు తనని రేప్ చేసి హత్య చేసాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ ఘటనలో నిందితుడిని నెల రోజుల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక(10) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సెప్టెంబర్ 3వ తేదీన సమీపంలోని షాప్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తర్వాతి రోజే ఓ క్వారీలో మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై అత్యాచారం చేసి చంపేసినట్లు తేలింది. దీంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటనా స్థలంలో దొరికిన ఓ చెప్పును బాలిక తల్లికి చూపించగా అది తమ పక్కింట్లో ఉండే మహేంద్రన్ అనే వ్యక్తిదని చెప్పింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.బాలిక తండ్రిలో ఉన్న పాతకక్షల నేపథ్యంలోనే ఆమెపై అత్యాచారం చేసి చంపేసినట్లు మహేంద్రన్ చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఎవరూ గుర్తుపట్టకుండా మృతదేహాన్ని క్వారీలో పడేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పెద్దోళ్ల పగకు చిన్నారి బలి కావడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Untitled Document
Advertisements