ఆర్టీసీ సమ్మె...రంగంలోకి మెట్రో

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 08:19 AM

ఆర్టీసీ సమ్మె...రంగంలోకి మెట్రో

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మెట్రోలో అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మెట్రో వేళల్లో హెచ్‌ఆర్‌ఎం మార్పులు చేసింది. శనివారం తెల్లవారు జాము 5 గంటల నుంచి నుంచి అర్ధరాత్రి 12.30 వరకు మెట్రోరైళ్లను నడపనున్నారు. ప్రతి 3,5 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుపుతున్నారు. రద్దీ ఉండే మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు, టికెట్‌ మిషన్లు ఏర్పాటు చేశారు.

Untitled Document
Advertisements