బ్లూటూత్‌లో ఉపయోగాలు తెలుసా?

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 08:11 AM

బ్లూటూత్‌లో ఉపయోగాలు తెలుసా?

సెల్‌ఫోన్‌ ఉన్నవారికి బ్లూటూత్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లూటూత్‌ వినియోగ పరిమితి రానురాను మరింత పెరిగింది. బ్లూటూత్‌ను ఫోన్‌ అన్‌లాక్‌ చేయడానికి, చాటింగ్‌కు, కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌ కనెక్టివిటీకి, కాలింగ్‌కు ఇలా అనేక రకాలుగా వినియోగించుకునే వెసులుబాటు వచ్చింది. దీనిని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..
*చాటింగ్‌:
ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేకుండానే ఇతర బ్లూటూత్‌ డివైజ్‌లతో చాటింగ్‌ చేసుకోవచ్చు. ఇందుకు బ్లూటూత్‌ చాట్‌ ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్‌ వారి వద్ద లేకున్నా.. దానిని బ్లూటూత్‌ ద్వారా పంపించుకోవచ్చు. ఇందులో చాటింగ్‌తో పాటు ఫొటోలు కూడా షేర్‌ చేసుకోవచ్చు. అంతేకాదు బ్లూటూత్‌ 5 టెక్నాలజీతో ఒకే సారి రెండు బ్లూటూత్‌ హెడ్‌సెట్‌లతో కనెక్ట్‌ అయి ఉండవచ్చు. బ్లూటూత్‌ స్టీరియో, సరౌండ్‌ సౌండ్‌ సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫోన్‌లోని బ్లూటూత్‌ సెట్టింగ్స్‌లోనే ఉంటాయి.
*ఫోన్‌ అన్‌లాకింగ్‌:
స్మార్ట్‌ఫోన్‌లో పెట్టుకున్న సెట్టింగ్స్‌ వల్ల ఫోన్‌ వినియోగించకుంటే కొన్ని సెకన్ల తర్వాత ఆటోమేటిక్‌గా ఫోన్‌ లాక్‌ పడిపోతుంది. ఏదైనా పనిలో ఉన్నపుడు ఇది కాస్త సమస్యగా మారిపోతుంది. ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా గానీ, ఫేస్‌ రికగ్నైజింగ్‌ ద్వారా గానీ మాటిమాటికీ లాక్‌ తీయాలనుకున్నా ఇబ్బందే అనిపిస్తుంది. అయితే హెడ్‌సెట్‌ తగిలించి ఉన్నంతసేపు ఫోన్‌ లాక్‌ పడకుండా చిన్నపాటి సెట్టింగ్స్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే హెడ్‌సెట్‌ ఫోన్‌కు ఉన్నంతసేపు ఫోన్‌లాక్‌ పడదు. ఇందుకు చేయాల్సింది.. ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి స్మార్ట్‌లాక్‌ ఆప్షన్‌లో ట్రస్ట్‌డ్‌ డివైజ్‌ ఆప్షన్‌లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న బ్లూటూత్‌ను ఎంచుకోవాలి.
*సిస్టమ్స్‌కు..:
బ్లూటూత్‌ ద్వారా దగ్గరలోని కంప్యూటర్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌లకు కనెక్ట్‌ అవ్వొచ్చు. లాక్‌, అన్‌లాక్‌ అవకాశాలు ఉన్నాయి. ఇందుకు రిమోట్‌ ఫింగర్‌ప్రింట్‌ లాక్‌ అనే అప్లికేషన్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని కంప్యూటర్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో డైనమిక్‌ లాక్‌ అనే సదుపాయం ఉంటుంది. దీనివల్ల ఒక నిర్దిష్టమైన పరిధిలో బ్లూటూత్‌ డివైజ్‌ ఉన్నపుడు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌ కనెక్ట్‌ అయి ఉంటుంది. దూరంగా వెళ్ళేపుడు ఆటోమేటిక్‌గా బ్లూటూత్‌ ఆఫ్‌ అయిపోయి లాక్‌ పడిపోతుంది. మ్యాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడే వినియోగదారులకు ఈ టెక్నిక్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
*యూబ్లూ రియాక్టర్‌:
సిస్టంకు బ్లూటూత్‌కు కనెక్ట్‌ లేదా డిస్‌కనెక్ట్‌ అయిన సందర్భాలలో కొన్ని పనులు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. ఇందుకు యూబ్లూ రియాక్టర్‌ పనిచేస్తుంది. బ్లూటూత్‌కు కనెక్ట్‌ అయిన తర్వాత ఒక అప్లికేషన్‌ను ఉపయోగిస్తూ, మ్యూజిక్‌ వింటున్నాం. కొంచెం దూరంగా వెళ్ళామంటే వెంటనే అప్లికేషన్‌, మ్యూజిక్‌ ఆగిపోతాయి. మళ్ళీ బ్లూటూత్‌ కనెక్ట్‌ అవ్వగానే అవి పనిచేయడం ప్రారంభిస్తాయి. దీని ద్వారా వైఫై కనెక్ట్‌, డిస్‌కనెక్ట్‌ అయినపుడు, కాల్స్‌ వచ్చినపుడు, ఫోన్‌ పవర్‌ సోర్స్‌కు కనెక్ట్‌ చేసిన పుడు కావాల్సిన పనులు ఆటోమేటిక్‌గా చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఈ వినియోగాలు తెలియక బ్లూటూత్‌ అంటే సాదాసీదాగా ఆలోచిస్తున్నారు.





Untitled Document
Advertisements