నెట్‌ఫ్లిక్స్ పై నిబంధనలు .. ఆ సీన్స్ ఉండకుంటే ఇంకెందుకు

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 03:55 PM

ఓవర్ టు ది టాప్ (ఓటీటీ) సేవలు అందిస్తున్న అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్ కి కూడా చెల్లు చీటీ పడనుంది. కొన్ని రకాల ఓటీటీ యాప్స్ నుండి వస్తున్న వెబ్‌సిరీస్ వీడియోలు మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించేవిలా, అలాగే కొన్ని సీన్స్ ఏమో అసభ్యకరంగా ఉన్నట్టు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఆ వైపుగా దృష్టిసారించింది. టీవీ, సినిమాలతో పాటు ఓటీటీ ద్వారా ప్రసారమవుతున్న వీడియోలకు కూడా సెన్సార్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఈ పల ఉన్నతాధికారి పెర్కొనట్టు చెబుతున్నారు. వాస్తవంగా ఓటీటీ కంటెంట్ విషయంలో ఎవరికి వారే స్వీయ నియంత్రణ విధించుకోవాలని ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వం కోరింది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఇందుకు సరిపోతాయని అభిప్రాయపడిన సంస్థలు ప్రభుత్వ సూచనను పట్టించుకోలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన మొదటి వెబ్‌సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని గతేడాది కొందరు కోర్టుకెక్కినా వారి అభ్యంతరాలను కోర్టు కొట్టివేసింది.
మరో సిరీస్‌లో హిందువులను కించపర్చే సన్నివేశాలున్నాయన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సరైన మార్గదర్శకాలు రూపొందించడంతోపాటు వెబ్‌సిరీస్ వీడియోలనూ సెన్సార్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.





Untitled Document
Advertisements