Any Pitch, Any Match .. one and only వీరేందర్ సెహ్వాగ్

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 11:39 AM

క్రికెట్ అభిమానులు ఒకప్పుడు అమితంగా ఇష్టపడే భారత బ్యాట్స్ మెన్ లలో ఒకరు వీరేందర్ సెహ్వాగ్. 1999లో క్రికెట్ అరంగ్రేటం చేసిన ఈ ఢిల్లీ క్రికెటర్.. 2001లో వరకు తనను తానూ నిరూపించుకోలేకపోయారు. 2001 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సెహ్వాగ్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు కీలక భాగస్వామ్యం అందించారు. అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయారు సెహ్వాగ్. ఆ తరువాత సచిన్ టెండూల్కర్ స్థానంలో ఓపెనర్ గా అడుగుపెట్టి.. గ్రౌండ్ లో పరుగుల వరదను పారించడంలో సెహ్వాగ్ సఫలుడయ్యాడు.

టెస్ట్ క్రికెట్ లో త్రిబుల్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా సెహ్వాగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా సెహ్వాగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తం వన్డేల్లో 251 మ్యాచ్ లు ఆడిన సెహ్వాగ్ 8273 పరుగులు చేశారు. టెస్ట్ విషయానికి వస్తే 103 టెస్టుల్లో 49.34 సగటున 8586పరుగులు చేశారు. బ్యాట్ తోనే కాకుండా సెహ్వాగ్ బాల్ తోనూ మెరుపులు మెరిపించాడు. వన్డేల్లో 96 వికెట్లు, టెస్ట్ మ్యాచ్ లలో 40 వికెట్లు తీసుకున్నారు సెహ్వాగ్. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సమయంలో సెహ్వాగ్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. కాగా, నేడు వీరు పుట్టినరోజు. వీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.





Untitled Document
Advertisements