మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు అడ్డంకులు

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 01:59 PM

బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2.7 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాన్ని వచ్చే నెలలో ఆవిష్కరించాల్సి ఉంది. అయితే, ఆఫ్రికా నల్లజాతీయులను బానిసలుగా, అనాగరికులుగా మహాత్మాగాంధీ పేర్కొన్నారని, కాబట్టి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించవద్దంటూ విద్యార్థులు రాసిన లేఖతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. విగ్రహావిష్కరణకు అనుమతి ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు.

అఫ్రికా నల్లజాతీయులను గాంధీ అవమానించారంటూ 2015లో మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పుడిదే విషయాన్ని హైలెట్ చేస్తూ విద్యార్థులు లేఖ రాశారు. ఆయన విగ్రహం ఆవిష్కరించడం అంటే మాంచెస్టర్‌లోని నల్లజాతీయులను అవమానించడమే అవుతుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. కాగా, నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన గాంధీని ఇప్పుడు అదే నల్లజాతీయులు వ్యతిరేకిస్తుండడం గమనార్హం.





Untitled Document
Advertisements