అరుదైన జబ్బుతో బాధపడుతున్న కేథరిన్ థెరిస్సా

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 05:40 PM

స్క్రీన్ మీద ప్రేక్షకులను కవ్వించే హీరోయిన్లకు ఎలాంటి సమస్యలు ఉండవు అనుకోవడం కరెక్ట్ కాదు. వారికుండే సమస్యలు వాళ్లకుంటాయి. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాధపడుతుంటారు. అందరు బయటపడరుగాని ఓ అందాల భామ మాత్రం తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు. బన్నీ నటించిన 'ఇద్దరమ్మాయిలతో' సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన కేథరిన్ థెరిస్సా.

ప్రాణాల మీదకు వచ్చే జబ్బు అయితే ఏమీ కాదు. కాని ఆమె ఈ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుందట. ఇంతకు ఆమె జబ్బు ఏంటంటే అనోస్మియ. ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు. వాసన చూసే శక్తి వారికి అస్సలు ఉండదు. ఈ జబ్బు అంత్యంత రేర్ గా వస్తుందట. లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్ కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జబ్బు ఉన్న కారణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. ఇక కేథరిన్ సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.





Untitled Document
Advertisements