ఉమేష్ మెరుపు సిక్సులు .. కోహ్లీ స్టెప్పులు

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 08:03 PM

రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇవాళ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మెరుపుదాడితో అలరించాడు. కేవలం 10 బంతులు ఆడిన ఉమేశ్ 31 పరుగులు సాధించాడు. ఉమేశ్ స్కోరులో 5 సిక్సులు ఉన్నాయంటే ఎంత దూకుడుగా ఆడాడో అర్థమవుతుంది. ఆ సిక్సులన్నీ కూడా ఒకే బౌలర్ ను ఉతకడం విశేషంగా చెప్పాలి. సఫారీ స్పిన్నర్ జార్జ్ లిండే విసిరిన ఓ ఓవర్లో 2 సిక్సులు బాదిన ఉమేశ్, ఆ తర్వాత లిండే ఓవర్లోనే 3 సిక్సులతో విరుచుకుపడ్డాడు.



ఓ టెయిలెండర్ బ్యాట్స్ మన్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం అంతాఇంతా కాదు. ఉమేశ్ సిక్స్ కొట్టినప్పుడులా డ్రెస్సింగ్ రూమ్ లో హుషారుగా కలియదిరుగుతూ బాగా ఎంజాయ్ చేశాడు





Untitled Document
Advertisements