ఆంధ్రా బ్యాంక్‌ గోల్డ్ బాండ్ స్కీమ్...బయట కన్నా చాలా బెట్టర్!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 11:15 AM

ఆంధ్రా బ్యాంక్‌ గోల్డ్ బాండ్ స్కీమ్...బయట కన్నా చాలా బెట్టర్!

ఆంధ్రా బ్యాంక్ తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) 2019-20 సిరీస్ 6 స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో బంగారు బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు దగ్గరిలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి బాండ్లను కొనుగోలు చేయవచ్చు.ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అక్టోబర్ 25 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. గ్రాము బంగారం ధర రూ.3,835గా ఉంది. డిజిటల్ మార్గంలో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 తగ్గింపు లభిస్తుంది. అంటే గ్రాము బంగారం ధర రూ.3,785 అవుతుంది.ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కలిగిన ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు ఆన్‌లైన్‌లోనే డైరెక్ట్‌గా గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దేశ పౌరులు ఎవరైనా గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. పిల్లల పేరుపై కూడా తీసుకోవచ్చు.కనీసం 1 గ్రాము బంగారం కొనుగోలు చేసిన సరిపోతుంది. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ట్రస్ట్‌లు ఇతర సంస్థలు ఏకంగా 20 కేజీల వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేయవచ్చు.బాండ్ల మెచ్యూరిటీ 8 ఏళ్లు. అంటే ఎనిమిదేళ్ల తర్వాత బాండ్లను వెనక్కు ఇచ్చేసి డబ్బులు తీసుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత కూడా అవసరం అనుకుంటే బాండ్లను వెనక్కు ఇచ్చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. గోల్డ్ బాండ్లపై సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ మీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.40,000 వద్ద కదలాడుతోంది. అంటే గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు రూ.3,785గా ఉంది. అంటే ఇది 10 గ్రాములకు రూ.37,850 అవుతుంది. మీరు జువెలరీ షాప్‌కు వెళ్లకుండా ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లి బంగారం కొనుగోలు చేస్తే రూ.2,150 ఆదా చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements