ప్రియురాలి అతి తెలివితో బ్రేకప్...పాపం బాయ్‌ఫ్రెండ్

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 08:18 PM

ప్రియురాలి అతి తెలివితో బ్రేకప్...పాపం బాయ్‌ఫ్రెండ్

ఓ యువతి పొరపాటున తన ప్రియుడికి బ్రేకప్ చెప్పి ఇప్పుడు అతడిని కలిసేందుకు తపన పడుతోంది. మాంచేస్టర్‌కు చెందిన జాయ్‌కు తన బాయ్‌ఫ్రెండ్ బెడ్ మీద ఉన్న తలగడ కింద ఓ మహిళ ఫొటో కనిపించింది. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘నువ్వు నీ మాజీ ప్రియురాలిని ఇంకా మరిచిపోలేదు. అందుకే, దాని ఫొటో తలగడ కింద పెట్టుకున్నావు’’ అని చెడామడా తిట్టేసి, బ్రేకప్ చెప్పేసి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో బాయ్ ‌ఫ్రెండ్.. ఆమె ఎవరి ఫొటో చూసిందో చూద్దామని తలగడ తీసి చూశాడు. ఆ వెంటనే అతడి మైండ్ కాసేపు బ్లాక్ అయ్యింది.
ఆమె ఏం చూసిందంటే..: ఆమె తలగడను పూర్తిగా చూసి ఉంటే సీన్ వేరేగా ఉండేది. కానీ, ఆమె సగం మాత్రమే తెరిచి చూసింది. వాస్తవానికి ఆ తలగడ కింద ఉన్నది మాజీ ప్రియురాలి ఫొటో కాదు. పరుపుల మీద ఉండే లేబుల్(స్టిక్కర్). దాన్ని ఆమె పూర్తిగా చూసి ఉంటే.. ఆ ఫొటోలో ఉన్న పురుషుడిని కూడా చూడవచ్చు. అయితే, ఆమె లేబుల్‌ను పూర్తిగా చూడకుండా అది.. ఫొటో అనుకుంది. ఈ తెలివి తక్కువ పనిని ఆమె ట్విట్టర్ ద్వారా స్నేహితులతో షేర్ చేసుకుంది. ఓ రాత్రి అతనితో పడుకున్నాను. అప్పుడు తలగడ కదపగా ఓ మహిళ నవ్వుతున్న ఫొటో కనిపించింది. ఉదయం లేవగానే అతడికి బ్రేకప్ చెప్పేసి ఇంటికి వెళ్లిపోయా అని తెలిపింది.ఆ తర్వాత అతడు ఆమెకు ఆ లేబుట్ ఫొటోను ట్వీట్ చేశాడు. అది చూడగానే జాయ్‌కు తల తిరిగినట్లయ్యింది. పరుపు మీద ఉన్న లేబుల్‌ను చూసి.. అతన్ని అపార్థం చేసుకున్నానా? అని కుమిలిపోయింది. వెంటనే ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసి తన తప్పును స్నేహితులకు వివరించింది.‘‘నా తప్పు తెలుసుకున్న తర్వాత అతడికి క్షమాపణలు చెబుతూ మెసేజ్ పెట్టాను. నేను ఇంత సైకో అనుకోలేదు. దయచేసి నా తప్పును క్షమించు’’ అంటూ పెద్ద వ్యాసమే రాశా. ఆ తర్వాత షవర్ కిందకి వెళ్లి చాలాసేపు ఏడ్చా. ఇక అతడు తనని క్షమించడని భావించాను. కానీ, అతడు నా మెసేజ్ అందగానే ఇంటి ముందు వాలిపోయాడు. నా పొరపాటును తలచుకుని తలపైకెత్తకుండా నవ్వుకున్నాడు. ఎట్టకేలకు నన్ను కలిశాడు. అంతకంటే ఏం కావాలి’’ అని పేర్కొంది. అయితే, వీరి గొడవ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె తెలివి తేటలకు అంతా సెటైర్లు వేస్తున్నారు.





Untitled Document
Advertisements