భర్తకు 47 మంది పిల్లలు...షాక్ లో భార్య!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 11:19 PM

తన భర్తకు 47 మంది పిల్లలు ఉన్నారనే విషయం తెలిసి ఆ భార్య షాకైంది. ఇక అతనితో జీవితం కొనసాగించలేనని, విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే, ఇందులో ఆ భర్త తప్పు ఏమీ లేదు. అతను ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లలను కనలేదు. ఆ పిల్లలంతా వీర్య దానం వల్ల పుట్టినవారే. కానీ, అతని భార్య మాత్రం దాన్ని తప్పుగానే భావిస్తోంది. వీర్య దానం తప్పు కాకపోయినా.. అతడు చేసిన పనికి ఆ పిల్లంతా ‘నువ్వే మా నాన్న’ అంటూ ఇంటికి వస్తే ఏం చేయాలంటూ ఆమె సందేహిస్తోంది. అతనితో విడిపోవడం మంచిదా? కలిసి ఉండాలా అనే విషయం మీద పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీనిపై స్నేహితులు, బంధువుల అభిప్రాయాన్ని కోరుతూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్లు ‘మిర్రర్’ వార్తా సంస్థ వెల్లడించింది. ‘‘ఎనిమిదేళ్ల కిందట మాకు పెళ్లయ్యింది. మాకు ఒక బిడ్డ ఉంది. మేం డేటింగ్ చేస్తున్నప్పుడు తాను వీర్య దానం చేస్తున్నట్లు చెప్పాడు. అయితే, ఎన్నిసార్లు చేశాడనే విషయం చెప్పలేదు. ఏదో ఒకరిద్దరికి ఇచ్చి ఉంటాడని భావించాను. ఇక ఎవరికీ వీర్య దానం చేయొద్దని కూడా చెప్పాను. గత వారం మీరు ఎన్నిసార్లు వీర్య దానం చేశారని అడిగితే.. 47 అని చెప్పాడు’’ అని తెలిపింది. ‘‘ఆ రోజు నేను ఎంతమందికి వీర్య దానం చేశారని అడగకపోవడం నా తప్పే. కానీ, భవిష్యత్తులో ఆ పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఇతనే వారి తండ్రని తెలుస్తుంది. వారంతా మా జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు నేను నా భర్తకు విడాకులు ఇవ్వాలా? కలిసి ఉండాలా అర్థం కావడం లేదు’’ అని తెలిపింది. అయితే, చాలామంది భర్తను వదలవద్దనే ఆమెకు సలహాలిచ్చారు. ‘‘నీ భర్త ఎవరితోనే నేరుగా శృంగారంలో పాల్గోలేనప్పుడు అతన్ని దోషిగా ఎందుకు చూస్తావు? అందులో అతని తప్పు లేదు. ఈ చిన్న విషయానికే మీ బంధాన్ని తెంచుకుంటావా? అతడు నీకు తెలియకుండా వీర్య దానం చేయలేదు కదా?’’ అని తెలిపాడు.





Untitled Document
Advertisements