కత్రినా బిజినెస్ కు నయనతార సహాయం

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 12:59 PM

కత్రినా బిజినెస్ కు నయనతార సహాయం

బాలీవుడ్ బార్బీ డాల్ కత్రినా కైఫ్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార సెలబ్రిటీగా మారారు. తాజాగా కత్రినా సొంతంగా మేకప్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తన క్యాంపెయిన్‌కు ప్రచారం కల్పించాల్సిందిగా నయనతారను కోరారు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న నయన్.. కత్రినా అడగ్గానే ఆమె కోసం ముంబయి వెళ్లిపోయారు. ఆ సమయంలో సెట్‌లో కూర్చుని ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన వీడియోను కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘సినిమాలతో అంత బిజీగా ఉన్నప్పటకీ నా క్యాంపెయిన్‌ కోసం పిలవగానే ముంబై వచ్చిన సౌత్ సూపర్‌స్టార్ నయనతారకు ధన్యవాదాలు. నిజంగా ఆమె చాలా గొప్పవారు’ అని పేర్కొన్నారు. సాధారణంగా నయన్ ఎక్కువగా టీవీ ప్రకటనల్లో కూడా పాల్గొనరు. అలాంటిది కత్రినా కైఫ్ అడగ్గానే ఆమె తన వంతు ప్రచారం కల్పించడానికి ముందుకొచ్చారు. ఇందుకు కత్రినా ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు మూటజెప్పారా లేదా అన్నది తెలియరాలేదు. నయనతారతో పాటు కత్రినా.. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను కూడా ప్రచారం కల్పించాల్సిందిగా కోరారు. వర్క్ పరంగా ‘భారత్’ సినిమాతో మంచి విజయం అందుకున్న కత్రినా ప్రస్తుతం ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. మరోపక్క నయనతార ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె విజయ్‌‌కు జోడీగా నటించిన ‘విజిల్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న ‘నేట్రికన్’ అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా ‘దర్బార్’ సినిమాలో నటిస్తున్నారు.





Untitled Document
Advertisements