ప్రభుత్వ నిజాలను బయటకు పెట్టకుండా మీడియా ఇంకేం చేస్తుంది...?

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 08:10 PM

ప్రభుత్వ నిజాలను బయటకు పెట్టకుండా మీడియా ఇంకేం చేస్తుంది...?

ఆస్ట్రేలియా ప్రభుత్వానికి మీడియా నుండి నిరసనలు వెలువెత్తాయి. మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారనే కారణంతో ఆస్ట్రేలియాకు చెందిన హెరాల్డ్ సన్ అనే దినపత్రిక.. సోమవారం ఎడిషన్‌లో నల్లటి గీతలతో నిరసన తెలిపింది. న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియా నెట్‌వర్క్‌కు చెందిన ఈ పత్రిక.. ప్రభుత్వం నిజాలను బయటకు రానీయనప్పుడు.. మీడియా ఏం కవర్ చేయాలని ప్రశ్నించింది. ఆ పేపర్‌తో పాటు మిగతా పత్రికలు కూడా మొదటి పేజీలో నల్లటి గీతలతో ప్రభుత్వ తీరుపట్ల నిరసన వ్యక్తం చేశాయి. ‘నాట్ ఫర్ ది రిలీజ్.. సీక్రెట్’ అని ప్రచురించాయి. మీడియా మీద ప్రభుత్వం నిఘా వేయాలని యోచిస్తోందని.. న్యూస్ కార్ప్ జర్నలిస్ట్ అన్నికా స్మెథురెస్ట్ ఓ కథనాన్ని వెలువరించారు. దీంతో ఆమె మీద దాడులు జరిగాయి. ఆస్ట్రేలియా ప్రత్యేక బలగాలు అప్ఘాన్‌లో చిన్నారులను కూడా చంపేస్తున్నాయని కథనాలను ప్రచురించిన ఏబీసీ హెడ్ క్వార్టర్స్ మీద కూడా దాడులు జరిగాయని హెరాల్డ్ సన్ తెలిపింది. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించొద్దంటూ.. ప్రైమ్ టైమ్‌లో ఛానళ్లు లైనప్స్‌ను ప్రసారం చేశాయి. గత కొన్నేళ్లలో ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా.. ఆస్ట్రేలియాలో 82కిపైగా జాతీయ భద్రతా చట్టాలను రూపొందించారు. ఈ చట్టాల వల్ల మీడడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియదని ఆస్ట్రేలియా నెటిజన్లు చెబుతున్నారు. ఆస్ట్రేలియా ప్రజలకు నిజాల్ని వెల్లడించే జర్నలిస్టులపై పదే పదే దాడులు జరగడం పట్ల మీడియా అసంతృప్తితో ఉంది. మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తూ.. నియంత్రణలను పెంచడాన్ని నిరసిస్తూ.. వార్తాపత్రికలు ఈ చర్యకు దిగాయి. ఆస్ట్రేలియా మీడియా నల్లటి గీతలను ప్రచురించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.





Untitled Document
Advertisements