కాలుష్యానికి హాని చేయని పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 06:03 AM

కాలుష్యానికి హాని చేయని పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలోని పలు పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల విస్తరణకు సంబంధించి గతంలో ఉన్న నిషేధాన్ని సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్త అనుమతులపై ఉన్న నిషేధాన్ని యధాతథం చేస్తూ, కాలుష్యానికి హా ని చేయని పరిశ్రమల ఏర్పాటుకు ప్ర భుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లోని బల్క్ పరిశ్రమల విస్తరణకు ఈ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత జిల్లాలై న మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మ హబూబ్‌నగర్‌లోని 51 పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉందని పిసిబి గతంలో ప్రభ్వుతానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో కాలుష్య అధికంగా ఉందని కొత్త పరిశ్రమల ఏర్పాటు వలన స్థానికంగా మరింత కాలుష్యం అధికమయ్యే ప్రమాదముందని పేర్కొనడంతో 2007 సంవత్సరంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుపై నిషేధం విధిస్తూ జీఓ 95ను వెలువరించింది. ఆయా ప్రాంతాల్లో కాలుష్య కారక పరిశ్రమలతో పాటు అక్కడి స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం పరిశ్రమల విస్తరణపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆ పాత నాలుగు జిల్లాల్లో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారికి ఈ నిషేధం ఇబ్బందిగా మారింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దక్షిణాది రాష్ట్రాల బెంచ్ చెన్నైకి ఈ కేసు వెళ్లడంతో కాలుష్య రహిత పరిస్థితుల్ని పునరుద్ధరించే వరకు, పరిశ్రమల విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దొని ఎన్జీటీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే ఆ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు నెలకొల్పానుకునే వారి వలన కొత్తగా ఎలాంటి కాలుష్య ప్రమాదం ఉండవద్దని, ఏదైనా ప్రజాప్రయోజనం ఉంటే పరిశీలించాలని సూచించింది. అయితే ఏర్పాటు చేసే కంపెనీల్లో వ్యర్థాలను బయటకు వదలని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జడ్‌ఎల్‌డీ) ఏర్పాట్లు ఉండాలని పటాన్‌చెరు, బొల్లారం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసి ఆయా కంపెనీల టర్నోవర్‌లో 1 శాతం మొత్తాన్ని అందులో డిపాజిట్ చేయాలని ఎన్జీటీ షరతులు విధించింది. ఈ నేపథ్యంలో గతంలో విధించిన నిషేధం ఉత్తర్వులను రద్దు చేయాలని కొత్త పరిశ్రమల ఏర్పాటు విస్తరణకు అనుమతించాలని బల్క్‌డ్రగ్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమల ఏర్పాటు విస్తరణ నిషేధంపై గతంలో జారీ చేసిన 95, 64 జీఓలకు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీఓ 24ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాలుష్యానికి హానిచేయని పరిశ్రమల స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టయ్యింది.





Untitled Document
Advertisements