మూడో రోజు తగ్గిన బంగారం ధర

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 07:04 AM

మూడో రోజు తగ్గిన బంగారం ధర

బంగారం ధర మరింత తగ్గింది. బుదవారం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,800కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.150 తగ్గింది. దీంతో ధర రూ.36,470కు క్షీణించింది. పసిడి ధర ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. ఏకంగా రూ.500 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర రూ.150 చొప్పున దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో ధర రూ.38,450కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 తగ్గింది. దీంతో ధర రూ.37,250కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. కేజీ వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. రూ.500 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.48,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 1,491.20 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.33 శాతం పెరుగుదలతో 17.55 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements