నేను అలానే శృంగారంలో ఎంజాయ్ చేస్తా ...

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 09:37 AM

దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియా ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో.. ఖుషి అయ్యింది. దేవదాస్ తరువాత వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసింది. ఆ తరువాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేసే సమయంలో ఈ హీరోయిన్ విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రు నిబోస్ తో ప్రేమలో పడింది. అయితే ఏమైందో ఏమో తెలియదుగాని, ఇటీవలే ఈ అమ్మడు బ్రేకప్ చెప్పి మరలా సినిమాలపై దృష్టిపెట్టింది.

మాములుగా హీరోయిన్లు శృంగారం వంటి విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడేందుకు కాస్త జంకుతారు. కానీ, ఇలియానా ఈ విషయాన్ని ఓపెన్ గా మాట్లాడింది. శృంగారం అన్నది రెండు శరీరాలకు సంబంధించినది మాత్రమే, కాదని రెండు మనసులకు సంబంధించిన విషయం కూడా అని చెప్పింది. యంత్రంలా కాకుండా రొమాంటిక్ గా ప్రేమతో శృంగారం చేయాలనీ, తాను అలానే శృంగారంలో ఎంజాయ్ చేస్తానని చెప్పింది ఇలియానా. ఇలియానా శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడటంతో.. అంతా షాక్ అయ్యారు.





Untitled Document
Advertisements