సోషల్ మీడియా కింగ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 04:48 PM

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా “అల వైకుంఠపురములో” వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సంసిద్ధం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు యూట్యూబ్ రికార్డులను వేటాడుతుంది.మొన్నామధ్య విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఇప్పటికే ఏ చిత్రం కూడా అందుకోని బిగ్గెస్ట్ రికార్డు వ్యూస్ మరియు లైక్స్ ను రాబట్టుకుంది.

అది కూడా అతి తక్కువ సమయంలోనే..ఇప్పుడు ఈ పరంపర సాంగ్ టీజర్ తో కూడా బన్నీ కొనసాగిస్తున్నారు.నిన్న విడుదల చేసిన మాస్ బీట్ “రాములో రాముల” కూడా టాలీవుడ్ లో ఇది వరకు విడుదల చేసిన మునుపటి హైయెస్ట్ లైక్స్ సంపాదించుకున్న “సాహో” లైఫ్ టైం లైక్స్ ను 24 గంటలు గడవక ముందే చెరిపేసిందని అంటున్నారు.ప్రస్తుతానికి అయితే ఈ టీజర్ సాంగ్ కు 1 లక్ష 59 వేల లైక్స్ వచ్చాయి.దీనికి ముందు సాహో లోని “ఏ చోట నువ్వున్నా”కు లైఫ్ టైం లో 1 లక్ష 40 వేలు వచ్చాయి.దీనితో మరోసారి అల్లు అర్జున్ సోషల్ మీడియా కింగ్ అనిపించుకున్నారని చెప్పాలి





Untitled Document
Advertisements