ధనుష్ సినిమా పై కన్నేసిన రాంచరణ్.. !!

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 05:28 PM

తమిళ హీరో ధనుష్ సినిమాలకు మంచి తెలుగులోనూ క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన కథలతో ధనుష్ సినిమాలు చేస్తుంటాడు. అలాగే తన సినిమాలను చాలా రియలిస్టిక్ గా ఉండేలా జాగ్రత్తపడతాడు. తాజాగా విడుదలైన 'అసురన్' సినిమాకూడా ఆ కోవకు చెందిందే. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు ధనుష్. ఈ చిత్రంతో ధనుష్ విమర్శల ప్రశంసలు దక్కించుకున్నాడు. "అసురన్" ఇటీవల విడుదలై 100 కోట్లు క్రాస్ చేసి ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇక ఈ సినిమాకు మెగా హీరో రాంచరణ్ రీమేక్ చెయ్యాలని చూస్తున్నాడు. రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా లా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆశ పడుతున్నాడట. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాలని చూస్తున్నారట. మరి నిజంగానే చరణ్ 'అసురన్' రీమేక్పై ఆసక్తి చూపిస్తున్నాడా లేదా అనేది అధికారిక ప్రకటన వస్తే కాని తెలియదు. నిజంగా ' అసురన్'సినిమా చేస్తే చరణ్ కెరియర్ లో మరో మైలు రాయిగా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చరణ్ 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తున్నాడు. ఆ తర్వాత చిరంజీవితో కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రం చేస్తాడని ప్రచారం జరుగుతోంది.





Untitled Document
Advertisements