అమ్మడి ఫోటోకి నెటిజన్లు ఫిదా..!!

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 08:03 PM

'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ నిక్కీ తంబోలి. హాట్ నెస్ కు నిక్కీ పెట్టింది పేరు. మొదటిసినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత కాంచన సినిమాలో నటించింది ఈ చిన్నది. కాంచన సినిమా మంచి విజయం సాధించడంతో నిక్కీ కి అవకాశాలు క్యూ కట్టాయి తమిళం తో పాటు బాలీవుడ్ లోను ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. నిక్కీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

హీరోయిన్ గా నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లో కూడా ఛాన్స్ లు దక్కించుకుంటుంది. అయితే లేటెస్టుగా బాంద్రాలో ఇండిగో డెలికేట్ సెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఈవెంట్ ముఖ్య అతిధిగా నిక్కీ తళుకుబెళుకులు హైలైట్ గా నిలిచాయి. బోల్డ్ బ్యూటీ అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డుచెప్పదని మరోసారి ప్రూవైంది. ఇక నిక్కీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుర్రకారు నిక్కీ ఫోటలకు తెగ లైకులు కొడుతున్నారు.





Untitled Document
Advertisements