పెళ్లి పీటలమీద సల్మాన్ పెళ్లి ఆగిపోయిందంట...అందుకే!

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 09:05 PM

పెళ్లి  పీటలమీద సల్మాన్ పెళ్లి ఆగిపోయిందంట...అందుకే!

కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఓ వార్త బయటికొచ్చింది. సల్మాన్ పెళ్లంటే కాస్త దూరంగా ఉంటాడు. ఈ మాట అందరికి తెలుసు. ఇక సల్మాన్‌ ఈ జన్మలో పెళ్లి చేసుకోరని అభిమానులకు కూడా అర్థమైపోయింది. దాంతో వారు కూడా ఆశలు వదులుకున్నారు. అయితే సల్మాన్ పెళ్లి పీటలదాకా వెళ్లి ఆగిపోయిందట. ఈ విషయాన్ని సల్మాన్ స్నేహితుడు, నిర్మాత సాజిద్ నదియాద్‌వాలా తెలిపారు. సల్మాన్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్, సాజిద్ ‘ది కపిల్ శర్మ షో’కి వెళ్లారు. ఆ షోలో సాజిద్ ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. 1999లో సల్మాన్‌కు పెళ్లి ఫిక్సయిందట. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి తేదీ ఫిక్సయింది. శుభలేఖలు కూడా పంచేశారు. దాంతో సాజిద్ కూడా సల్మాన్‌తో పాటు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతను కూడా ఓ అమ్మాయిని చూసుకున్నాడు. 1999 నవంబర్ 18న సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ బర్త్‌డే కావడంతో అదే రోజున సల్మాన్, సాజిద్ పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకున్నారు. కానీ పెళ్లికి వారం రోజులు ఉందనగా ‘నాకు పెళ్లి చేసుకోవాలన్న మూడ్ లేదు’ అనేశాడట. దాంతో ఇంట్లో వారంతా షాకయ్యారు. ఎందుకని అడిగితే ఏం సమాధానం చెప్పలేదు. ఇక చేసేదేంలేక సాజిద్ అదే రోజున పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో సల్మాన్ సాజిద్ పెళ్లికి వెళ్లాడు. స్టేజ్‌పై ఉన్న సాజిద్ వద్దకు వెళ్లి ‘బయట కారు ఉంది. అది తీసుకుని పారిపో’ అన్నాడట. అయితే ఆ సమయంలో సల్మాన్ ఎవర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అన్న విషయాన్ని మాత్రం సాజిద్ చెప్పలేదు. కానీ సల్మాన్ పెళ్లి చేసుకోవాలనుకుంది ప్రముఖ బాలీవుడ్ నటి సంగీతా బిజిలానీనే అని చాలా మందికి తెలుసు. సల్మాన్, సంగీత గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఓసారి సంగీత మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం గమనించిన సల్మాన్ ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. తాను మాత్రం ఇక ప్రేమ, పెళ్లిళ్లకు సమయం కేటాయించదలచుకోలేదని సల్మాన్ తెలిపాడు. అయితే సంగీత తర్వాత సల్మాన్.. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్‌లతో డేటింగ్ చేశాడు. వీరిద్దరితో కూడా సెట్ అవ్వలేదు. ఆ తర్వాత రొమేనియాకు చెందిన మోడల్ ఉలియా వంటూర్‌ను ఇండియాకు తీసుకొచ్చి అందరికీ షాకిచ్చాడు. ఆ అమ్మాయిని నేరుగా తన ఇంటికి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశాడు. దాంతో సల్మాన్, ఉలియా పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆ తతంగం కూడా అవ్వలేదు. కత్రినా ఎప్పటికైనా తనకోసం రాకపోదా అని సల్మాన్ ఎదురుచూశాడు. ఇక తనపైన కూడా ఆశలు వదులుకున్నాడు. ఒకవేళ సల్మాన్ పెళ్లంటూ చేసుకుంటే ఉలియానే చేసుకుంటాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.





Untitled Document
Advertisements