హాట్ టాపిక్‌గా మారిన భూమిక ఇన్స్టా పిక్స్!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:48 AM

తెలుగులో సుమంత్ హీరోగా 2000లో వచ్చిన ‘యువకుడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది భూమిక. ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఆ తరువాత తెలుగు, హిందీ, తమిళ భాషలో నటించిన ఈ భామ స్టార్‌డమ్‌ను కోల్పోయింది. అయితే ఈ మధ్య భూమిక క్యారెక్టర్ ఆరిస్ట్‌గా ప్రాధాన్యం ఉన్న పాత్రలలో కనిపిస్తోంది. ‘ఎంసిఏ’ చిత్రంలో హీరో నానికి వదినగా చేసిన ఆమె యూ టర్న్, సవ్యసాచి చిత్రాలలో కూడా మంచి పాత్రలు చేసింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో భూమిక పెట్టిన ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి. 41 ఏళ్ల వయసులో ఈ బ్యూటీ హాట్ ఫొటోలతో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.





Untitled Document
Advertisements