మాస్క్‌డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా...దీంతో ఎన్నో లాభాలు!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 11:15 AM

మాస్క్‌డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా...దీంతో ఎన్నో లాభాలు!

అత్యంత కీలకమైన దృవీకరణ పత్రాల్లో ఆధార్ కార్డ్ ఒకటి. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఆధార్ కార్డును మరింత సురక్షితంగా మార్చేందుకు యూఐడీఏఐ మాస్క్‌డ్ ఆధార్ కార్డులను కూడా అందిస్తోంది. మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఎవరికైనా చెప్పడానికి ఇష్టపడకపోతే అప్పుడు మాస్క్‌డ్ ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చు. మాస్క్‌డ్ ఆధార్ కార్డును డిజిటల్లీ సైన్‌డ్ ఇఆధార్‌గా పరిగణించొచ్చు. దీంతో మీ ఆధార్ డేటాకు పూర్తి భద్రత లభిస్తుంది. ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయి. అయితే మాస్క్‌డ్ ఆధార్ కార్డులో కేవలం 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా 8 అకెంలను మాస్క్ (ఇంటూ మార్క్) ద్వారా కవర్ చేస్తారు. ఇక్కడ కేవలం ఆధార్ నెంబర్‌పై మాత్రమే మాస్క్ ఉంటుంది. బయోమెట్రిక్స్, ఫోటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటివి అలానే ఉంటాయి. ఎయిర్‌పోర్ట్స్, ట్రైన్ టికెట్ బుకింగ్ వంటి పలు సందర్భాల్లో ఐడెంటిఫికేషన్ కోసం మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించొచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాస్క్‌డ్ ఆధార్ కార్డులను ఉపయోగించడం కుదరదు. ఎల్‌పీజీ సబ్సిడీ, పెన్షన్ వంటి వాటికి ఈ ఆధార్ కార్డు ఇవ్వకూడదు.

మాస్క్‌డ్ ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

✺ యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.

✺ హోమ్ పేజ్‌లో డౌన్‌లోడ్ ఆధార్ లింక్‌పై క్లిక్ చేయండి.

✺ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఆధార్ నెంబర్, పేరు, పిన్ కోడ్ వంటి వివరాలు ఎంటర్ చేయండి.

✺ తర్వాతి స్టెప్‌లో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మాస్క్‌డ్ ఆధార్ అని ఎంచుకోండి.

✺ ఇప్పుడు మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.





Untitled Document
Advertisements