పెళ్లయిన వారానికే భర్తకు విషం పెట్టిన నవవధువు!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 01:00 PM

పెళ్లయిన వారానికే భర్తకు విషం పెట్టిన నవవధువు!

పెళ్లయి వారం రోజులు గడవకముందే కట్టుకున్న భర్తను చంపాలని చూసిందో నవవధువు. పాలల్లో విషం కలిపి భర్తకు ఇచ్చింది. వాటిని తాగిన భర్త నోట్లో నుంచి నురగలు కక్కుకోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు అదే జిల్లాకు చెందిన మదనంతపురం గ్రామానికి చెందిన యువతితో వారం రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో అన్ని కార్యక్రమాలు నిరాటంకంగా జరగడంతో కుటుంబసభ్యులు, బంధువులు సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో నవవధువు ఆదివారం పాలు తెచ్చి భర్తకు ఇచ్చింది. అది తాగిన లింగమయ్య నోట్లో నుంచి నురగలు కక్కుకుంటూ పడిపోయాడు.దీంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లింగమయ్యను పరీక్షించిన డాక్టర్లు అతడు తాగిన పాలల్లో విషయం కలిసినట్లు గుర్తించారు. దీంతో లింగమయ్యను అతడి భార్యే చంపేందుకు ప్రయత్నించిందని అతడి సోదరుడు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును జొన్నగిరి పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు.


Untitled Document
Advertisements