భారత్‌పై ఇప్పటికీ సానుకూలమే!

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 07:10 AM

భారత్ పట్ల తనకు ఇప్పటికీ చాలా సానుకూల దృక్పథం ఉందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, మోబియస్ క్యాపిటల్ పార్టర్స్ వ్యవస్థాపకుడు మోబియస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో రేట్ల తగ్గింపు అవసరం ఎంతో ఉందని, ఆర్‌బిఐ ఈసారి కూడా వడ్డీ రేటును తగ్గించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్‌బిఐ రేట్లను యథాతధంగా కొనసాగించాలనుకోవడం దురదృష్టకరమని, ఆర్‌బిఐలో దూరదృష్టి లోపించిందని విమర్శించారు. భారత్‌పై తాము ఇప్పటికీ పాజిటివ్ ధృక్పథం కొనసాగిస్తామని అన్నారు. 2020లో భారత్ మంచి ప్రదర్శన చూపుతుందని, భవిష్యత్‌లో దేశీయ వ్యయాల్లో టెలికం కీలకం కానుందని ఆయన అన్నారు. విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి వడ్డీరేట్ల యథాతథ పరిస్థితికి మొగ్గు చూపి అందరిని ఆశ్చర్యపర్చింది. ప్రస్తుత రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.90 శాతాన్ని అలాగే కొనసాగించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. దేశ జిడిపి వృద్ధి రేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్‌బిఐ కనీసం పావు శాతం మేరకు రెపో రేటును తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడం, రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశాలుండటం వల్ల రేట్ల కోతకు ఆర్‌బిఐ మొగ్గుచూపలేదు.





Untitled Document
Advertisements