'JPO' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 11:05 AM

'JPO' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. జేపీవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 15న రాతపరీక్ష నిర్వహించనున్నారు. జేపీవోతోపాటు జూనియర్ లైన్‌మెన్ పరీక్ష హాల్‌టికెట్లను కూడా అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో మొత్తం 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TSSPDCL నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 21 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. వీరికి డిసెంబరు 15న రాతపరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం..
➦ మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 3 సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-'ఎ' 50 మార్కులు-50 ప్రశ్నలు, సెక్షన్-'బి' 20 మార్కులు-20 ప్రశ్నలు, సెక్షన్-'సి' 50 మార్కులు-50 ప్రశ్నలు ఉంటాయి.
➦ సెక్షన్-ఎలో హెచ్ఆర్‌ఎం, ఇండస్ట్రియల్ లా, జనరల్ లా, లేబర్ లా మొదలగు వాటి నుంచి ప్రశ్నలు ఉంటాయి.
➦ సెక్షన్-బిలో కంప్యూటర్ అవేర్‌నెస్ ప్రశ్నలు ఉంటాయి.
➦ సెక్షన్-సిలో కాంప్రహెన్షన్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ అరిథిమెటికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

విద్యుత్ ఉద్యోగాల దరఖాస్తుల్లో రిజక్ట్ అయిన అభ్యర్థుల వివరాలను ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. సరైన విద్యార్హతలు లేనికారణంగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిలో 2847, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిలో 5414 మంది అభ్యర్థులను, అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి 14,757 మంది అభ్యర్థుల దరఖాస్తులను సంస్థ తిరస్కరించింది. వీరికి డిసెంబరు 5న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది.





Untitled Document
Advertisements