పొట్ట ఇబ్బంది పెడుతుందా .. ఇలా తగ్గించుకోండి

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 02:06 PM

కూర్చుని చేసే ఉద్యోగులకు పెద్ద సమస్య పొట్ట పెరగడం. శరీరానికి శ్రమ లేకుండా ఉండటం వల్ల ఊబకాయం వస్తుంది. దీంతో పొట్ట రావడం సులభం తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సిందే. ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేయడం వల్ల శరీరానికి శ్రమ కలిగి, కొంత పొట్ట తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి అని చెబుతున్నారు నిపుణులు.

* ఇల్లు ఊడవడం, తుడవడం వల్ల ఎక్కువ సంఖ్యలో కెలొరీలు ఖర్చవుతాయి. ఎంత సమయం మీరు వాటికి కేటాయిస్తున్నారనే దానిపై కెలొరీల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఇది కార్డియో వ్యాయామాలతో సమానం. పొట్ట తగ్గాలనుకునేవారు చీపురు, ఇల్లు తుడిచే కర్ర చేత పట్టండి మరి.
* దుస్తులు ఉతికినా బరువు తగ్గొచ్చు. అయితే చేతులతో ఉతికితేనే ఆ ఫలితం కనిపిస్తుంది. బట్టలు ఉతకడం, ఆరేయడం, ఆరినవాటిని మడత పెట్టడం, వాటిని ఇస్త్రీ చేయడం… వంటివీ కెలొరీలు తగ్గించే పనులే. ముఖ్యంగా ఉద్యోగినులు వారాంతంలో దుస్తులు వారే స్వయంగా ఉతకడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

* వారాంతాల్లో పిజా, బర్గర్, నూడుల్స్ అంటూ బయటి ఆహారం తినకుండా ఇంట్లోనే స్వయంగా చేసి మీతోపాటు ఇంటిల్లిపాదికి తినిపించండి. ఆరోగ్యంతోపాటు, బరువును తగ్గించే ఆహార
పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వండి. వారంలో అయిదుసార్లు ఇంటి భోజనం తినడం వల్ల 24 శాతం కొవ్వు చేరదని అధ్యయనాలు
చెబుతున్నాయి.a
* ఇల్లు సర్దడం, సోఫాలు, మంచాలు శుభ్రపరచడం లాంటి వాటి వల్లా కెలొరీలు కరుగుతాయి.
* కొన్ని పనులను పాదాలపై బరువు వేస్తూ కూర్చుని చేయడం వల్ల తొడలు, పొట్ట దగ్గర పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. తోటపనితోనూ ఎంతో మార్పు కనిపిస్తుంది. రోజూ కనీసం అరగంటసేపు మొక్కలకు నీళ్లు పెట్టినా… పాదులు తవ్వినా మార్పు ఉంటుంది.

* ఎక్కువ సమయం వంట గదిలో ఉండండి. మీకు తెలియకుండా మీ శరీరంలో కొవ్వు మెల్లిగా కరగడం మొదలవుతుంది. పాత్రలు కడగడం, గ్యాసుగట్టు, గ్యాసు పొయ్యి శుభ్రం చేయడం… ఈ పనుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి.





Untitled Document
Advertisements