‘ఆగడు’ ఫ్లాప్ కు నేనే కారణం!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:54 PM

‘ఆగడు’ ఫ్లాప్ కు నేనే కారణం!

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా అట్అటర్యి ఫ్తేలాపైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం నేనే అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను ‘ఆగడు’ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ అందించాను. సినిమా జరుగుతుండగానే నాకు కళ్యాణ్ ‌రామ్‌తో ‘పటాస్’ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. దాంతో ‘ఆగడు’ సెకండ్ హాఫ్ అప్పటికి ఇంకా పూర్తి కాలేదు. దాంతో ‘పటాస్’ సినిమాకు అనుకున్న సెకండ్ హాఫ్‌ను ‘ఆగడు’కి వాడుకుందామని దర్శకుడు శ్రీనువైట్లతో చెబుదామని వెళ్లాను. నేను చెప్పేలోపు వైట్ల గారు సెకండ్ హాఫ్‌ మీద వర్క్ స్టార్ చేసేశారు. ఆయన తన ఫార్మాట్‌కే వెళ్దామని చెప్పడంతో సరే అదే చేద్దామని అన్నాను. ఒకవేళ నేను ఆయనతో డిస్కస్ చేసి ఉంటే ‘పటాస్’ సెకండ్ హాఫ్‌ ‘ఆగడు’ అయ్యుండేదేమో. ఆ సమయంలో మాకు టైం లేదు. ఫాస్ట్‌గా స్క్రిప్ట్ చేశాం. నాకు పటాస్ స్టార్ట్ అవ్వడంతో నేను అటే వెళ్లిపోయా. ఇప్పటికీ వైట్ల గారు నాతో అప్పుడప్పుడూ ఏమయ్యా నాతో సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్లిపోయావ్ నీ అంతు చూస్తా అని అంటుంటారు. ఇప్పటికీ ఈ విషయంలో నాకు బాధగానే ఉంది. నేను వైట్ల గారి కోసం కాస్త సమయం కేటాయించి ఉంటే ‘ఆగడు’ మంచి హిట్ అయివుండేది.








Untitled Document
Advertisements