ఎయిడ్స్ ఎలా వస్తుంది?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 09:21 PM

ఎయిడ్స్ ఎలా వస్తుంది?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?!

మధ్యకాలంలో ఎయిడ్స్ వ్యాధి ప్రభావం తగ్గినట్టు కనిపించినా.. కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి బారిన ఎక్కువ మంది పడుతున్నట్లు తేలింది. తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది హెచ్‌ఐవీ కేసులు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ ఉందని తేలింది. అసలు ఈ వ్యాధిక ఎందుకు వస్తుంది.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తెలిపిన లెక్కల ప్రకారం దేశంలోనే అధికంగా హైదరాబాద్‌లో హెచ్‌ఐవి పాజిటివ్ బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 83,102 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు తేలింది. 2017 గణాంకాల ప్రకారం ఈ ఒక్క సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో నమోదైన హెచ్‌ఐవీ కేసులు 9,324. ఇక అప్పట్నుంచీ ఆ సంఖ్య తగ్గట్లేదు..

ఎయిడ్స్ డే సందర్భంగా గణాంకాలను వెల్లడించిన సంస్థ.. దేశంలోనే ముఖ్యంగా హైదరాబాద్‌లో బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. అనంతరం కరీనంరగర్, నల్గొండ జిల్లాలు ఉన్నాయని సంస్థ తెలిపింది. ఈ సమస్యను తగ్గించాలని ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అవి ఏ మాత్రం సఫలం కావడం లేదు. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

హెచ్ఐవీ అనేది ప్రాణాంతకమైన వ్యాధి.. ఇది సోకితే క్రమం తప్పకుండా మందులు వాడితే ప్రాణాపాయం లేకుండా జీవనకాలాన్ని కొనసాగించొచ్చు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీన్ని సమూలంగా నివారించొచ్చు.

రక్తమార్పిడి ద్వారా కూడా ఈ వ్యాధి వస్తుంది.
సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం కొనసాగించాలి.సురక్షిత శృంగారమే కొనసాగించాలి.. విచ్చలవిడి శృంగారం సుఖవ్యాధులకు దారితీస్తుంది. ఇవి ఉన్న వారికి హెచ్‌ఐవీ సోకే అవకాశాలు పదిరెట్లు ఎక్కువగా ఉంటాయి.రక్తం తీసుకున్నప్పుడు గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంక్‌ల నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి.సెలూన్స్‌కి వెళ్లినప్పుడు కొత్త బ్లేడ్ వాడడాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఈ వ్యాధి సోకితే కొన్ని లక్షణాలు కనబడతాయి. దాంతో వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వ్యాధి నిరోధక శక్తి తగ్గి దీంతో ఇన్ఫెక్షన్లు ఎదురవుతాయి.

ఈ వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరాక ముందుగా ఫ్లూ వంటి లక్షణాలు ఎదురవుతాయి.

అదే విధంగా ఈ వ్యాధి గనుక సోకితే ఉన్నట్టుండి బరువు తగ్గుతారు.

తరచూ విరేచనాలు కావడం కూడా వ్యాధి లక్షణాల్లో ఒకటి..సుఖవ్యాధులకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స ఉంటుంది. కండోమ్ వాడకం, వ్యక్తి అలవాట్లు, ప్రవర్తనల్లో మార్పు తీసుకురావటం అనేవి రెండూ కూడా ముఖ్యమైన నివారణ చర్యలు.

ఎయిడ్స్ వ్యాధి సోకే తీరుపై కూడా చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హెచ్ఐవి వచ్చినవారికి షేక్ హ్యాండ్ ఇస్తే వాధి వ్యాప్తి చెందదు.

అదే విధంగావ్యాధి వచ్చిన వారిని ముద్దుపెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నది కూడా అపోహనే. తుమ్ములు, దగ్గు, ఇంట్లోని వస్తువులను కలిసి ఉపయోగించుకోవడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందదు. ఒకే టాయిలెట్‌ని ఉపయోగించడం వల్ల ఇది వ్యాపించదు..హైచ్‌ఐవి క్రిమిగాలి, నీరు, ఆహారం, స్పర్శ, వస్తువులు, దోమల ద్వారా ఈ వ్యాప్తి చెందదు.





Untitled Document
Advertisements