ఎస్‌బీఐ బంపర్ ఆఫర్స్...రూ.10,000 డిస్కౌంట్

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 01:18 PM

ఎస్‌బీఐ బంపర్ ఆఫర్స్...రూ.10,000 డిస్కౌంట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎస్‌బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్ రూపంలో బంపరాఫర్లు అందుబాటులో ఉంచింది. సూపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. డిసెంబర్ 14 వరకు మాత్రమే ఎస్‌బీఐ యోనో ఫెస్టివల్ అందుబాటులో ఉంటుంది.

*ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యా్క్ లభిస్తుంది. అలాగే టాప్ 100 స్పెండర్స్‌కు రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

*మహీంద్రా కారు కొనుగోలుపై రూ.5,000 విలువైన యాక్ససిరీస్‌ను ఉచితంగా పొందొచ్చు. అలాగే ఐజీపీ.కామ్‌లో కొనుగోళ్లపై 25 శాతం తగ్గింపు ఉంది.

*ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే అదనపు రివార్డు పాయింట్లు పొందొచ్చు.

*తనిష్క్ జువెలరీలో ఆభరణాలు కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ట్రాన్సాక్షన్ వ్యాల్యూ కనీసం రూ.5,000 ఉండాలి.

*పెప్పర్‌ప్రైలో ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు ఉంది. అలాగే లైఫ్‌స్టైల్‌స్టోర్స్.కామ్‌లో 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఫస్ట్‌క్రై.కామ్‌లో 45 శాతం వరకు తగ్గింపు ఉంది.

*ఈజీమై ట్రిప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఏకంగా రూ.7,500 వరకు తగ్గింపు లభిస్తోంది. థామస్ కుక్.ఇన్‌లో హాలిడేస్ ప్యాకేజీ బుకింగ్స్‌పై రూ.10,000 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

*ఎస్‌బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.

*టాటా మోటార్స్ కారు కొనుగోలు చేస్తే రూ.10,000 విలువైన యాక్ససిరీస్‌ను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. హ్యుందాయ్ కార్లపై అదనంగా రూ.5,000 క్యాష్ డిస్కౌంట్ ఉంది. రెనో కారుపై రూ.10 వేల విలువైన యాక్ససిరీస్‌ను ఫ్రీగా పొందొచ్చు.

*ఫోర్డ్ కారు కొనుగోలుపై ఏకంగా రూ.22,000 విలువైన యాక్ససిరీస్‌ను ఉచితంగా పొందొచ్చు. ఓయో హోటల్స్ బుకింగ్‌పై 40 శాతం తగ్గింపు ఉంది.





Untitled Document
Advertisements