అభిజీత్ వినాయక్ కు నోబెల్ బహుమతి!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 02:15 PM

అభిజీత్ వినాయక్ కు నోబెల్ బహుమతి!

ఆర్థిక శాస్త్రంలో అభిజీత్ వినాయక్ బెనర్జీలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ బహుమతిని ఇప్పటి వరకు ముగ్గురు బెంగాలీలు నోబెల్ బహుమతి అందుకున్నారు. రవీంద్రనాథ్ టాగూర్, అమర్త్య సేన్, అభిజీత్ బెనర్జీలున్నారు. అభిజీత్ బంగారపు రంగు అంచుగల దోతి, పైజామా ధరించి నోబెల్ బహుమతి అందుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిజీత్ తో పాటు ఆర్థిక శాస్త్రంలో ఇస్తార్ దోఫ్లో, మైఖల్ క్రెమెర్ నోబెల్ బహుమతి అందుకున్నారు. అమెరికాలో ఉన్న భారతీయ సంప్రదాయాలు మరిచిపోలేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అభిజీత్‌ను సంప్రదాయ దుస్తువులో చూసి గర్విస్తున్నామని శ్రుతి పాండే నెటిజన్ కామెంట్ చేశారు. భారతీయులలో మొదటిసారిగా రవీంద్రనాథ్ టాగూర్‌ కు 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి వరించింది. భౌతిక శాస్త్రంలో చంద్రశేఖర్ వెంకట్ రమణ్ (1930), మెడిసిన్‌లో హరిగోవింద్ ఖురాన్ (1968), శాంతి విభాగంలో మదర్ థెరిస్సా(1979), భౌతిక శాస్త్రంలో సుభ్రమణ్యన్ చంద్రశేఖర్(1983), ఆర్థిక శాస్త్రంలో అమర్త్య సేన్ (1998), సాహిత్యంలో సర్ వడియధర్ సురాజ్ ప్రసాద్ నైపాల్ (2001), రసాయన శాస్త్రంలో వెంకట్ రమణ రామకృష్ణన్(2009), శాంతిలో కైలాశ్ సత్యార్థి (2014)లు నోబెల్ బహుమతి గ్రహించారు.





Untitled Document
Advertisements