విజయవంతంగా నింగిలోకి ఎగిరిన పీఎస్ఎల్వీ సీ48

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 03:54 PM

విజయవంతంగా నింగిలోకి ఎగిరిన పీఎస్ఎల్వీ సీ48

ఇస్రో బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పిఎస్‌ఎల్‌విసి-48ని నింగిలోకి పంపింది. పీఎస్ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా రిశాట్ 2బీఆర్1 సహా మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. శ్రీహరికోట ప్రయోగం కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీసీ-48 రాకెట్ 23 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమైన 23 గంటల సాగుతోంది. వాస్తవానికి ఈ కౌంట్‌డౌన్ సాయంత్రం 4.25 నిమిషాలకు ప్రారంభించాల్సి ఉండగా, 4.30 వరకు రాహుకాలం ఉండటంలో 4.40 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 3.25 గంటలకు వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా రిశాట్ 2బీఆర్1 సహా మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. శ్రీహరికోట ప్రయోగం కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీసీ-48 రాకెట్ 23 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమైన 23 గంటల సాగుతోంది. వాస్తవానికి ఈ కౌంట్‌డౌన్ సాయంత్రం 4.25 నిమిషాలకు ప్రారంభించాల్సి ఉండగా, 4.30 వరకు రాహుకాలం ఉండటంలో 4.40 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 3.25 గంటలకు వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహంతో దేశ భద్రత మరింత పటిష్టమవుతుంది. ఈ ఉపగ్రహం శత్రు కదలికలపై స్పష్టమైన సమాచారం చేరవేస్తారు. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతూ శత్రువుల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఎమిశాట్ ప్రయోగం నిర్వహించడానికి ముందు శత్రువుల రాడార్ల సమాచార సేకరణ కోసం భారత్ విమానాలపైనే ఆధారపడేది. ఈ ప్రయోగం తర్వాత అంతరిక్షం నుంచే అవకాశం లభిస్తుంది. శత్రుదేశాల రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎక్కడున్నాయో గుర్తించడం, శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఇమిశాట్‌ రాకతో 24 గంటలు నిఘావేసే అవకాశం దక్కింది. ఇక, ఇస్రో చరిత్రలో శ్రీహరికోట నుంచి ఒకే ఏడాది ప్రయోగించిన అన్ని ఉపగ్రహాలు సైనిక ప్రయోజనం కోసం ఉద్దేశించినవి కావడం విశేషం. రిశాట్2బీఆర్1‌తోపాటు జపాన్‌కు చెందిన క్యూపీఎస్-ఎస్ఏఆర్ మైక్రోశాటిలైట్‌ ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు.







Untitled Document
Advertisements