వర్మను ఉతికారేసిన కేఏ పాల్ కోడలు!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:03 PM

వర్మను ఉతికారేసిన కేఏ పాల్ కోడలు!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'. ఈ సినిమాలో తన మామగారిని అవమాన పరిచారంటూ మీడియా ముందు రచ్చ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోడలు జ్యోతి బిగల్. అసలు ఎవరి అనుమతి తీసుకుని తన మామగారిని వర్మ అవమానించారని ప్రశ్నించారు. ‘చాలాకాలంగా వర్మ మామగారి గురించి దరిద్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రపతి అంటే దేశానికి ప్రథమ పౌరుడు. అలాంటి వ్యక్తికే గౌరవం ఇవ్వని వర్మ.. ఇక సాధారణ వ్యక్తులకు ఏమిస్తాడు. వర్మ ఇదే పని సౌదీ అరేబియా రాజుపై చేయగలడా? అక్కడ ఇలాంటి వెధవ వేషాలు వేస్తే ఉరితీస్తారు. వర్మ చాలా ధైర్యవంతుడు, గొప్పవాడు అని చాలా మంది పొగుడుతున్నారు. అతను నిజంగా గొప్పవాడైతే పొగడటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఇతరుల పరువు తీసే మనిషిని ఎందుకు గౌరవించాలి’ ‘అతను మాట్లాడే ప్రతీ మాటను సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. వర్మకు నిజంగానే ధైర్యం ఉంటే నేరుగా పోరాడి చూపించమనండి. అంతేకానీ ట్విటర్‌లో చిన్న ట్వీట్లు పెట్టి ఏం చూపించాలనుకుంటున్నారు? ఏంటిది అని అడిగితే కేఏపాల్ పేరుతో చాలా మంది ఉన్నారు అని వర్మ అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ ఉందన్నారు. నిజమే. కానీ సమాజంలో ఆ స్వేచ్ఛతో పాటు కొన్ని సామాజిక విలువలు కూడా ఉన్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు వర్మను ఏమీ చేయలేకపోతున్నాయి. ఆయన నిజంగానే ట్యాలెంటెడ్ అయితే చూపించుకోమనండి. అంతేకానీ ఇతరుల పరువు తీసే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారు? ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే ఆపాలి. నవంబర్ 29న సినిమాను విడుదల చేయాల్సి ఉన్నప్పుడు సెన్సార్ బోర్డు టైటిల్ మార్చాలని అంది. టైటిల్ మార్చాలని అప్పుడే గుర్తుకు వచ్చిందా? అప్పటివరకు నిద్రపోతున్నారా?’ ‘ సెన్సార్ బోర్డు సినిమా చూపించడానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మీడియా దేశానికి నాలుగో స్తంభం అంటారు. కాబట్టి మీరే న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. వర్మకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా విడుదలైనప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు ఇప్పుడెందుకు నా సినిమాకు అడ్డు చెప్తున్నారు అని వర్మ ప్రశ్నించారు. దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే.. ఆ సినిమాను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కించారు. సినిమాపై ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై మేం అభ్యంతరం చెప్తున్నాం కాబట్టి ఆపండి’ అన్నారు.







Untitled Document
Advertisements