టీమిండియా విజయం సాధించడంలో ఆశ్చర్యమేమి లేదు!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 03:38 PM

టీమిండియా విజయం సాధించడంలో ఆశ్చర్యమేమి లేదు!

విండీస్-భారత్ మధ్య ముగిసిన టీ20 సిరీస్ లో టీంఇండియా 2-0 తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్ణయాత్మక పోరులో భారత్‌ ఓడుతుందని ఎవరూ అనుకోరని, అందుకే టీమిండియా విజయం సాధించడంలో తనకి ఆశ్చర్యమేమి లేదని గంగూలీ అన్నారు. సిరీస్‌ చివరి టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కేఎల్‌ రాహుల్ (91), విరాట్‌ కోహ్లీ (70*), రోహిత్‌శర్మ (71) చెలరేగడంతో మొదట టీమ్‌ఇండియా 240 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్‌ 173 పరుగులే చేయగలిగింది. దీపక్‌ చాహర్‌, భువీ, షమి, కుల్‌దీప్‌ రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కోహ్లీసేన కైవసం చేసుకుంది. దీంతో దాదా టీమిండియాను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 'భారత్ సిరీస్‌ను కోల్పోతుందని ఎవరూ అనుకోరు. అందుకే టీమిండియా విజయం సాధించినా ఆశ్చర్యమేమి లేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ అత్యద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. భయం లేకుండా ఆడింది. ప్రతిఒక్కరూ తమ స్థానాల కోసం కాకుండా దేశాన్ని గెలిపించడం కోసం ఆడారు. వెల్‌డన్‌ టీమ్‌ఇండియా' అంటూ ట్వీటాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా చెన్నై వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Untitled Document
Advertisements