బాలికను రేప్ చేసి, చంపి, సిమెంట్ కాంక్రీట్‌లో కలిపిన కామాంధుడు!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 05:07 PM

బాలికను రేప్ చేసి, చంపి, సిమెంట్ కాంక్రీట్‌లో కలిపిన కామాంధుడు!

మహారాష్ట్రలో ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు అంతటితో ఆగకుండా ఆమెను కిరాతకంగా చంపేసి స్నేహితుడి సాయంతో సిమెంట్ కాంక్రీట్‌లో వేసి ఖననం చేసేశాడు. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని ఉత్తాన్ జిల్లాలో వెలుగుచూసింది. ఉత్తాన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గొంతు నులిచి చంపేశాడు. బాలిక శవం దొరక్కుండా ఉండేందుకు తన స్నేహితుడిని సాయం కోరాడు. వారిద్దరు కలిసి బాలిక శవాన్ని ఓ భవన నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి ప్లాస్టిక్ డ్రమ్ములో వేశారు. సిమెంట్ కాంక్రీట్‌తో ఆ డ్రమ్మును నింపి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక శవాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Untitled Document
Advertisements