ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ హాల్‌టికెట్లు విడుదల

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 05:36 PM

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ హాల్‌టికెట్లు విడుదల

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (అడ్మిట్ కార్డు) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినరోజు వివరాలు అవసరమవుతాయి. డిసెంబరు 29 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 28, 29 తేదీల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి జనవరి 25న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి మొదటి లేదా రెండో వారంలో మెయిన్స్ పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. తదనంతరం మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తుది ఎంపిక ఫలితాలను ఏప్రిల్‌లో వెల్లడించనున్నారు.

ఎంపిక విధానం: మొత్తం మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో మెయిన్స్ పరీక్ష, మూడో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఏప్రిల్‌లో తుది నియామకాలు చేపడతారు.

ముఖ్యమైన తేదీలు . . .

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.11.2019.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.11.2019.
➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): 2019 డిసెంబరులో.
➥ ప్రిలిమినరీ రాతపరీక్ష: 28.12.2019, 29.12.2019
➥ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు: 2020 జనవరిలో
➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (మెయిన్ పరీక్ష): 2020 జనవరిలో.
➥ మెయిన్ రాతపరీక్ష: 25.01.2020.
➥ మెయిన్ రాతపరీక్ష ఫలితాలు: 2020 ఫిబ్రవరిలో.
➥ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2020 ఫిబ్రవరిలో.
➥ ఇంటర్వ్యూ నిర్వహణ: 2020 ఫిబ్రవరిలో.
➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: 2020 ఏప్రిల్‌లో.

Untitled Document
Advertisements