టీ20 ర్యాంకింగ్స్‌....టాప్-10లో కోహ్లీ రీఎంట్రీ

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 05:57 PM

టీ20 ర్యాంకింగ్స్‌....టాప్-10లో కోహ్లీ రీఎంట్రీ

ఐసీసీ వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత కొంతకాలంగా టీ20ల్లో మాత్రం పూర్తిగా దిగజారిపోయాడు. అయితే, విండీస్ తో తాజాగా ముగిసిన మూడు టీ20ల సిరీస్ లో రెండు హాఫ్ సెంచరీలతో పాటు 183 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌’ని అందుకున్నాడు. దీంతో.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ మళ్లీ టాప్-10లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఉప్పల్ టీ20లో 94 పరుగులు చేసిన కోహ్లీ, తిరువనంతపురం టీ20లో 19 పరుగులు, వాంఖడే మ్యాచ్‌లో 29 బంతుల్లో 70 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ర్యాంకింగ్స్‌లోనూ ఐదు స్థానాలు పైకి ఎగబాకిన కోహ్లీ 10వ ర్యాంక్‌ని అందుకున్నాడు. ఇక వాంఖడే టీ20లో 91 పరుగులు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ మూడు స్థానాలు పైకి ఎగబాకి ఆరో ర్యాంక్‌కి చేరుకోగా.. తొలి రెండు టీ20ల్లోనూ ఫెయిలై మూడో టీ20లో 71 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఒక స్థానం చేజార్చుకుని 9వ ర్యాంక్‌తో సరిపెట్టాడు. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (5వ ర్యాంక్), రవిచంద్రన్ అశ్విన్ (9), మహ్మద్ షమీ (10) టాప్-10లో చోటు దక్కించుకోగా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా (2), అశ్విన్ (5)లకి మాత్రమే టాప్-10లో స్థానం లభించింది. భారత్, వెస్టిండీస్ మధ్య ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని టీమిండియా 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.

Untitled Document
Advertisements