కొండచిలువ ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డుగా వేసి...!!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 07:53 PM

కొండచిలువ ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డుగా వేసి...!!

నూతిలో పడ్డ కొండచిలువను కాపాడేందుకు ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి నూతిలో దిగాడు. పట్టు తప్పడంతో అదే నూతిలో జారి పడ్డాడు. కేరళాలోని త్రిస్సూర్‌లో ఓ కొండ చిలువ నూతిలో చిక్కుకుంది. ఈ సమాచారం అందుకున్న త్రిస్సూర్ అటవీ పర్యవేక్షకుడు షాగిల్ అక్కడికి చేరుకుని కొండ చిలువను రక్షించేందుకు సిద్ధమయ్యాడు. తాడు సాయంతో నూతిలోకి దిగిన త్రిస్సూర్.. ఒక చేత్తో కొండ చిలువ, మరో చేతితో తాడును పట్టుకుని నూతి నుంచి పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే, కొండ చిలువను చూసిన గ్రామస్తులు షాగిల్ చేయి పట్టుకుని పైకి లాగడంలో విఫలమయ్యారు. దీంతో షాగిల్ పాముతోపాటు నూతిలో పడిపోయాడు. గ్రామస్తులు వెంటనే తాడును నీటిలో వేసి షాగిల్‌ను బయటకు లాగారు. ఈ సందర్భంగా షాగిల్ మాట్లాడుతూ.. ‘‘నూతిలో కొండ చిలువను చూడగానే.. దాన్ని ట్రాప్ సాయంతో పట్టుకుందామని ప్రయత్నించాం. కానీ, అది ఎంతకీ చిక్కలేదు. చాలాసేపు ప్రయత్నించి అలసిపోయాం. మరోదారి లేకపోవడంతో తాడు పట్టుకుని నూతిలోకి దిగేందుకు ప్రయత్నించా. చెట్టు కొమ్మ సాయంతో కొండ చిలువను నా వైపు లాక్కున్నా. దాని తలను పట్టుకుని పైలేపాను. దాన్ని నా శరీరానికి చుట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నించా. ఒకరిని నా చేయి పట్టుకోవాలని అడిగాను. మరి వారు నా చేతిలో కొండ చిలువను చూసి భయపడ్డారో ఏమో.. నన్ను వదిలేశారు. దీంతో నూతిలో పడిపోయా. నూతి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో విధానంలో కొండ చిలువను బయటకు తీసుకొచ్చాం’’ అని తెలిపాడు.





Untitled Document
Advertisements