కంపెనీకి కొత్త ఎండీని నియమించే పనిలో

     Written by : smtv Desk | Mon, Jan 13, 2020, 11:45 AM

దేశంలోనే అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ తమ కంపెనీకి కొత్త ఎండీని నియమించే పనిలో ఉన్నారు. సెబీ నూతన నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త ఎండీ కోసం అన్వేషిస్తున్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఛైర్మన్‌ బాధ్యతలు వేర్వేరుగా ఉండాలని సెబీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో, అంబానీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెబీ నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం.. బోర్డు ఛైర్‌పర్స్‌న్‌గా ఉండే వ్యక్తి ఇకపై నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది.

Untitled Document
Advertisements