సమస్య సృష్టించాలని అనుకుంటే ‘మీరెవరూ ఉండలేరు’

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 07:17 PM

కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడులను పవన్ కల్యాణ్ ఖండించారు. గాయపడ్డ తమ కార్యకర్తలను పవన్ పరామర్శించారు. అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండటం దారుణమని అన్నారు.

తమ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా దూషించారని, వైసీపీ భాష దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న తమపై ఇలాంటి దాడులు సబబు కాదని, బాధ్యత గల వ్యక్తులం కనుక ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నామని అన్నారు. నిరసనలు తెలిపే హక్కు కూడా తమకు లేదా? తమపై దాడులు చేసింది చాలక కేసులు కూడా పెడతారా? అని ప్రశ్నించారు.

ఈ ఘటనకు కారణమైన ఎమ్మెల్యేపై పోలీసులే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొస్తామంటే ప్రజలు సహించరని అన్నారు. అదే కనుక, శాంతిభద్రతల సమస్య సృష్టించాలని తాము కనుక అనుకుంటే ‘మీరెవరూ ఉండలేరు’ అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. ఇలాంటి ఘటన మరోమారు జరిగితే చూస్తూ ఊరుకోమని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Untitled Document
Advertisements