కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

     Written by : smtv Desk | Fri, Jan 17, 2020, 06:58 PM

– షుగర్‌ (డయాబెటీస్‌) ఉన్న వారిలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం.
– మూత్రంలో ప్రొటీన్‌ పోతున్న కారణంగా కిడ్నీ సమస్య ఏర్పడుతుంది.
– ఫ్లోరైడ్‌ నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడతారు.
– నొప్పుల మాత్రలు అధికంగా వాడటం వల్ల, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.
– వంశపారపర్యంగాను, జన్యు లోపం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.
– కిడ్నీ వ్యాధులకు గురైన వారిలో మొదట్లో పాదాలు వాపు, ఆ తర్వాత కాళు మొత్తం వాపు రావడం, కళ్లు చుట్లూ వాపు, బీపీ అధికంగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో నురగ రావడం, రక్తహీనత (అనీమియా) ఏర్పడటం, చిన్నపనికి అలిసిపోవడం, ఎముకలు నొప్పులు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
– షుగర (డయాబెటీస్‌) వచ్చిన వెంటనే ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
– వీలైనంత వరకు నొప్పుల మాత్రల వాడకం తగ్గించుకోవాలి.
– ప్రతి రోజు 3లీటర్ల మంచి నీటిని తాగాలి.
– అధిక బరువు అంటే ఒబెసిటి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి.
– పొగతాగడం మానేయాలి. నిత్యం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. నాన్‌ వెజిటేరియన్‌ ఫుడ్‌ను తగ్గించాలి. లేదా వీలైతే మానేయడం మంచిది.





Untitled Document
Advertisements